ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణంగా ఉంది. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తోంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 2022 నుండి ఇప్పటివరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఇంకా 324 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచిచూడాలి.

 

 

 

Tags:
Views: 14

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే