నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్, సెప్టెంబర్ 16: నగరంలోని గచ్చిబౌలిలో  ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్‌లో సీసీ టీవీ ఫుటేజ్, విద్యార్థిని మొబైల్, వాట్సప్‌ మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థినికి ఇంటర్నెల్‌గా ఏమైనా గాయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ప్రాథమిక విచారణలో విద్యార్థినిది ఆత్మహత్యే అనే పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్‌ను సేకరించారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతుండటంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.‘‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రావాలని.. మాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది. మేము హుటాహుటిన ఇక్కడకు వచ్చేసరికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో పెట్టారు. రూంలో ఏం జరిగిందో మాకు తెలియదు. హత్య చేశారా.. లేక ఇంకా ఏదైనా అనేదా మాకు తెలియదు. మేము వచ్చేసరికి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. ఉరి వేసుకుందని చెబుతున్నారు. కూతురి ఒంటిపై గాయాలు ఉన్నాయి. తెలిసిన వాళ్లతోనే మా అమ్మాయి ఉంది. అంతా కలిసే భోజనం చేశారు. ఆ తరువాత మా కూతురిని వాళ్లు ఏం చేశారో తెలియదు. మాకు ఉరి వేసుకుందని ఫోన్‌లో చెప్పారు. మా కూతురును హత్య చేశారు. మాకు న్యాయం కావాలి’’ అంటూ విద్యార్థిని తండ్రి డిమాండ్ చేశారు.‘‘శనివారం మాతో మాట్లాడింది. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఒకరికి ధైర్యం చెబుతుందే కానీ అలా చేసి ఉండదు. నా బిడ్డను ఏదో చేసి చంపారు. జాబ్ గురించి ఎప్పుడూ బాధపడలేదు. రూం ఖాళీ చేస్తాను అని చెప్పింది. శనివారం మాట్లాడింది.. ఆదివారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా బిడ్డ ఒంటిపైన గాయాలు ఉన్నాయి. అమ్మాయి స్నేహితులే ఏదో చేశారు’’ అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

Tags:
Views: 0

Advertisement

Latest News

అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ...
ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల.
పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్
నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి