పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ :సీఎం రేవంత్
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పీసీసీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ మధ్య కొందరు నేతలు తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై పలువురు కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఏం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ చేశారు.కాగా.. ఇటీవల మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. హీరోయిన్ సమంత, నాగచైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ ఇచ్చిన స్టేట్‌మెంట్ రచ్చకు కారణమైంది. అంతే కాకుండా అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత విషయాలపై మంత్రి కామంట్స్ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తన కామెంట్స్‌పై కొండా సురేఖ క్షమాపణల చెప్పినప్పటికీ సమస్య సద్దుమణలేదు. పైగా కొండా సురేఖపై అటు హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్‌ను కోర్టులో పరువునష్టం దావా కేసులు వేశారు. అయితే కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు కొంత మేరక పార్టీకి కూడా నష్టాన్ని చేకూర్చాయని పార్టీ వర్గాల టాక్.ఇదిలా ఉండగా.. ఇటీవల కలెక్టర్ల విషయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కూడా అనేక విమర్శలకు దారి తీసింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పదిసార్లు ఫోన్ చేసిన తన ఫోన్ ఎత్తకపోవడంతో కలెక్టర్‌ను తిట్టానంటూ జగ్గారెడ్డి ఆయన మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగచెక్కర్లు కొట్టింది. కలెక్టర్ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశానని, కలెక్టర్ ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానని.. అంతేకాకుండా కలెక్టర్ భర్తతో పడుకుందా అని కూడా పీఏను ప్రశ్నించానని.. తనకు కోపం వస్తే ఇలాగే ఉంటుందని జగ్గారెడ్డి ప్రసంగించినట్లు వీడియోలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుత కలెక్టర్లను ఉద్దేశించి తాను అనలేదని.. గత ప్రభుత్వంలో కలెక్టర్లపై మాట్లాడినట్లు జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ తరువాత మీడియాపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మగ కలెక్టర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపారన్నారు. తాను ఒకటి చెబితే పలు టీవీ ఛానళ్లు మరోటి ప్రసారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.అయితే వీరిద్దరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కూడా పార్టీకి మైనస్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పీసీసీ ముఖ్యులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎవరూ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని.. అలా చేస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు.
Comment List