తలనొప్పిగా మారిన అక్రమ మద్యం దుకాణం.

రైస్ అమ్మకం పేరిట దుకాణంలో మద్యం అమ్మకం .పట్టించుకోని అధికారులు

తలనొప్పిగా మారిన అక్రమ మద్యం దుకాణం.

ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 10:
మండల కేంద్రమైన రెంటచింతలలోని తాసిల్దార్ కార్యాలయం సమీపాన ఉన్న జామియా మర్కస్ మస్జీద్ ప్రక్కనగల అక్రమ బెల్ట్ షాప్ కాలనీ వాసులకు పెద్ద తలనొప్పిగా మారింది.టి దుకాణం వలే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఈ షాపు అనధికారికంగా నిర్వహిస్తూ కాలనీ వాసులకు తంటాలు తెస్తుంది అధికారులకు విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వారిని ఏమి చేయలేని స్థితిలో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
రైస్ అమ్మకం పేరిట దుకాణంలో మద్యం అమ్మకం
పేరుకేమో బియ్యం వ్యాపారం లోపల చూస్తే అక్రమ మద్యం అమ్మకం బియ్యం అమ్మకం పేరిట దుకాణం లీజుకు తీసుకుని లోపల చాప కింద నీరు లాగా నిత్యం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలు,కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు.
బెల్ట్ షాపు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే ధారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు.ఎక్కువగా ప్రజల మధ్య అల్లరులు,గొడవలు జరగడానికి మద్యం కారణమవుతోంది.అనధికార బెల్టుషాపు నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచిచుడాలి.

Tags:
Views: 18

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ