ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..

ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 18:సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్‌లో ప్రధానంగా చర్చజరుగనుంది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నారు. అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్‌లో ప్రధానంగా చర్చజరుగనుంది.18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా చర్చ జరుగనుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించాడంలో భాగంగా పీ 4 పైనా ఈరోజు కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.అలాగే పెండింగులో ఉన్న నీరు - చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదలపై చర్చ జరుగనుంది. బుడమేరు ముంపు, వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైనా కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

 

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ