వచ్చే నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

 వచ్చే నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 18: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లను రద్దు చేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్‌లను ప్రారంభించిందన్నారు.కడప, ప్రొద్దుటూరులో కలిపి రేపు(గురువారం) 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలలో ప్రారంభించి, నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12 వేల 500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు అవుతుందన్నారు.వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఏదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరిపిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు ఇసుకను వైస్సార్సీపీ నాయకులు మాఫియాలాగా అక్రమ రవాణా చేసి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. ప్రైవేట్ మద్యం విధానాన్ని తీసుకునివచ్చి అన్ని బ్రాండ్‌లకు పరిచయం చేయబోతున్నారని తెలిపారు. మద్యం రేట్లు తగ్గించి ప్రతి పేదవాడికి అందే విధంగా తెస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.

 

 

Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ