పులివెందులలో అన్న క్యాంటీన్

పులివెందులలో అన్న క్యాంటీన్

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17:న్న క్యాంటీన్లు… పేదల ఆకలి తీర్చే యజ్ఞం. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తారు. 5 రూపాయలకు ఏమీ రాని ఈ రోజుల్లో కడుపు నిండా భోజనం పెడుతున్నారు.కానీ, టీడీపీకి పేరు వస్తుందంటూ జగన్ అధికారంలోకి రాగానే అన్నింటినీ మూయించారు. తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. దశల వారీగా రాష్ట్రం అంతా విస్తరిస్తామని ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గ కేంద్రం అయిన పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. పులివెందుల మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో అన్న క్యాంటీన్ ను బుధవారం ఉదయం ప్రారంభించబోతున్నారు.జగన్ అధికారంలో ఉండగా… రాయలసీమ పట్టభద్రుల స్థానం నుండి గెలిచిన ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఈ అన్న క్యాంటీన్ ను ప్రారంభించబోతున్నారు.పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను కూడా రాజకీయ కోణంలో చూస్తూ… మూయించి, వారి కడుపు కొడితే, సీఎం చంద్రబాబు మాత్రం పులివెందులలో సైతం ఆకలి తీరాలన్న ఆలోచనతో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారని, ఇదీ చంద్రబాబుకు జగన్ కు ఉన్న తేడా అంటూ టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి.

 
 
Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ