వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు.. టీడీపీ సీనియర్ సంచలన వ్యాఖ్యలు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించినా.. జగన్‌లో ఇంకా మార్పు రాలేదు అని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం వింతగా అనిపిస్తోందని అన్నారు. తన పార్టీని ఘోరంగా ఓడించినందుకు ప్రజలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.పవన్ కల్యాణ్ వరద బాధితులను ఆదుకున్నారని, రూ.4 కోట్ల విరాళం ప్రకటించారని, అయినా సరే ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని గంటా శ్రీనివాస రావు అన్నారు. జగన్ లాగా పవన్ కల్యాణ్‌కి లక్షల కోట్లు రూపాయల అక్రమ సంపాదన లేదని అన్నారు. కోట్లాది రూపాయలు ఆస్తులున్న జగన్.. కేవలం కోటి రూపాయలే విరాళం ప్రకటించారని విమర్శించారు. వరద బాధితులను ఆదుకోకుండా.. జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయంపై లేనిపోని విమర్శలు చేస్తే జగన్ చరిత్రహీనులుగా మారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ మోహన్ రెడ్డికి నదికి, వాగుకి మధ్య తేడా తెలియటం లేదు. ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు గానీ బుడమేరు నది అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని గంటా శ్రీనివాస రావు పంచులు పేల్చారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ