బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 18: భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది. ఇంతకీ ఏం జరిగింది? హైకోర్టు ఎందుకు అలాంటి ఆదేశాలిచ్చింది? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్రమించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆరోపించారు. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అదికారులను సైతం ఆదేశించారు. మున్సిపల్ అధికారులు సైతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు.మంత్రి ఆదేశాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. పార్టీ కార్యాలయం కట్టిన తరువాత ఏ రకంగా అనుమతిస్తారని సూటిగా ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి గానీ.. కట్టిన తరువాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశిచింది. అంతేకాదు.. రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని ఆదేశించింది.

 

 

 

 
Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ