ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వలంటీర్ల సంచలన ప్రకటన

ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వలంటీర్ల సంచలన ప్రకటన

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 16:ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై చర్చలు జరుగుతున్నాయి. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు గ్రామ వలంటీర్లలో నెలకొన్నాయి.వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఇటీవల వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వలంటీర్లు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో వలంటీర్ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తుండడంతో వలంటీర్లు సంచలన ప్రకటన చేశారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో వలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
 
Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ