ఏ పి యస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈనెల 13న ధర్నా .

ఏ పి యస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈనెల 13న ధర్నా .

 ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 11:వెయ్యి  రూపాయల అతి తక్కువ పెన్షన్ తో దుర్భర జీవితం గరుపుతున్న తామంతా ఈనెల 13వ తేదీన నెల్లూరులోని ఆర్టీసీ  ఆర్ ఎమ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు తెలిపారు.నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడారు. ఏపీయస్ ఆర్టీసీ లో మాజీ ఉద్యోగులుగాఉన్న 15  వేల మంది కార్మికులం దుర్భర జీవితం గడుపుతున్నామన్నారు. అసలే చాలీచాలని జీతాలతో ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తామంతా కేవలం వేయి రూపాయల పెన్షన్ తో  కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వాచ్మెన్లుగా , ఆటో డ్రైవర్లుగా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈపీయస్ - 95 పెన్షన్ ప్రవేశపెట్టి 29 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎలాంటి పెరుగుదల లేనందున తమ బాధలను ధర్నాల ద్వారా పరిష్కరించు కునేందుకు సమాయత్తం అయ్యామన్నారు. రిటైర్డ్  ఉద్యోగులంతా ఈధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్  రెడ్డి , జి శంకరయ్య , బిపి  నరసింహారెడ్డి , టివిజే నాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 7

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ