జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన అనకాపల్లి ఎం.పీ

1.పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులుకు ఆదేశం. 2.వాడ్రపల్లి రైతంగానికి అండగా సీ.ఎం రమేష్, సుందరపు విజయ్ కుమార్.

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన అనకాపల్లి ఎం.పీ

ఐ ఎన్ బి టైమ్స్ అనకాపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 09: జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురైన నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లాలో పలు ప్రాంతాలను అధికారులు శంఖవరం గ్రామం దగ్గరలో ఉన్న బోజ్జనకొండ పరిసర ప్రాంతాలలో నీట మునిగిన పంట పొలాలను స్థానిక ఏలేరు కాలువను పరిశీలించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.అవసరమైతే సొంత నిధులతో ఎక్స్వెయిటర్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.గత ఐదు ఏళ్లలో రైతంగాన్ని పట్టించుకోలేదని కాలువల పుడికతీతలు గురించి ఆలోచించలేదు అని గత ప్రభుత్వ విధానాలు మీద మండిపడ్డారు.అనంతరం యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో కలసి మునగపాక పరిసర ప్రాంతాలలో వడ్రపల్లి గ్రామ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాల గురించి గ్రామస్థుల నుంచి వివరాలు అడిగి సేకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.రైతంగానికి అన్నీ విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అనిభరోసాకలిపించారు.ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు తో మాట్లాడుతూ భారీ వ‌ర్షం కుర‌వ‌డం వ‌ల్ల ఈ ప్రాంత‌మంతా అత‌లాకుత‌ల‌మైంద‌న్నారు. కొన్ని చోట్ల చెరువులు, కాలువ‌ల‌కు గండ్లు ప‌డ్డాయని, రోడ్లు దెబ్బ‌తిన్నాయని, విద్యుత్ అంత‌రాయం క‌లిగింద‌ని, పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని వివ‌రించారు. జిల్లాలోని నీటి ప్రాజెక్ట్ లు అన్నినిండుకుండ‌లా మ‌రాయున్నారు.అదేవిధంగా అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారా యంత్రాంగాన్ని వివరాలు తెలియజేయాలని ఆదేశించినట్లు తెలిపారు.అదే విధంగా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు.భారీ వర్షాలు వరదల వల్ల జిల్లా వ్యాప్తంగా కొంత మేరకు నష్టం జరిగిందన్నారు.ప్రభుత్వం అన్నీ విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పర్యటన లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్,  టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపూరెడ్డి పరమేశ్వర రావు మరియు అధికారులు,స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 18

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ