బ్రేకింగ్: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

బ్రేకింగ్: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17 న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు.ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని మర్లేనాను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా లెప్టినెంట్ గవర్నర్‎కు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ వెంట మంత్రులు, ఆప్ ముఖ్యనేతలు లెప్టినెంట్ గవర్నర్ నివాసానికి వెళ్లారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‎ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‎పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే.అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు షరతులు విధించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ (సెప్టెంబర్ 17) సీఎం పదవికి రిజైన్ చేశారు. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ప్రజల తీర్పు ఆధారంగానే సీఎం పదవి చేపడతానని.. అప్పటి వరకు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనని కేజ్రీవాల్ శపథం చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ నూతన సీఎంగా ఆప్ కీలక నేత, మంత్రి అతిశీ ఎన్నికైంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

 
 
Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ