జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది ...ఎమ్మెల్యే జూలకంటి

జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది ...ఎమ్మెల్యే జూలకంటి


ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 09:జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసిందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. నలభై ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిస్వార్ధ ప్రజాసేవకై అంకితమై కోట్లాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుట్రలతో జైలు పాలు చేసి నేటికీ ఏడాది పూర్తి అయిందని ఆయన అన్నారు. ఆనాడు జగన్ వికృత చేష్టలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆ సంఘటనతో తెలుగు ప్రజలు నియంత పాలనను చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలుపు తమ గెలుపుగా భావించి అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీకి భారీ విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేని విధంగా తీర్పు ఇచ్చి పదకొండు సీట్లకే పరిమితం చేశారని అన్నారురాష్ట్ర ప్రజలు ఇచ్చిన అఖండ మెజారిటీలతో ఇచ్చిన గెలుపును తమపై ఉంచిన బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలకు నిస్వార్థపూరితంగా సేవ చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని అన్నారు. గతంలో రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమలు నియంత పోకడలను భరించలేక రాష్ట్రం నుంచి వెను తిరిగాయని తిరిగి వాటిని రాష్ట్రంలో పునర్నిర్మించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

Tags:
Views: 32

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ