53 మందిని జీవీఎంసీ ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రాలకు తరలింపు

జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి!

53 మందిని జీవీఎంసీ ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రాలకు తరలింపు


 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం, సెప్టెంబర్ 9:నగరంలో వర్షాలు పడుతున్న దృష్ట్యా కొండవాలు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రస్తుతం 45 మందిని జీవీఎంసీ ఏర్పాటుచేసిన పునరవాస కేంద్రాలకు తరలించామని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఆదివారం నగరం లో ఎడతెరపిలేని వర్షం కారణంగా 8వ జోన్ 91వ వార్డు పరిధిలోని రామకృష్ణ నగర్ సమీపంలో కొండవాలు యొక్క రక్షణ గోడ జారినందున ఆ ప్రాంతంలోని 38 మందిని అప్రమత్తం చేసి జీవీఎంసీ ఏర్పాటుచేసిన గోపాలపట్నం మండల ప్రజా పరిషత్ పాఠశాలకు తరలించగా వారు ఆశ్రయం పొందుతున్నారని, అలాగే జోన్-1 తగరపువలస పబ్లిక్ లైబ్రరీలో ఏడుగురును, జోన్-2 13వ వార్డులో జైభీమ్ నగర్ ప్రాంతం లో నున్న 8 కుటుంబాలు చెందిన 20 మందిని  పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతితో పాటు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు,వైద్యంమొదలైనమౌలికసదుపాయాలనుకల్పించామన్నారు. నగరంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ముందస్తుగా 80 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, పునరవాస కేంద్రాలలో నున్న ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి కౌన్సిలింగు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే కాలువలలో, ఎర్రిగెడ్డ లో వ్యర్దాలను లేకుండా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. నగరం లో వర్షాలు ప్రారంభమైన నుండి జివిఎంసి అధికారులు, జోనల్ కమీషనర్లు, కొండవాలు, లోతట్టు ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం నిరంతరం చేపడుతున్నారన్నారు.వర్షాలు కురిసే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు సంభవించే వరకు వేచి ఉండకుండా ముందస్తుగా పునరవాస కేంద్రాలకు ఆశ్రయం పొందేఁదుకు కొండవాలు, లోతట్టు  ప్రాంతాల ప్రజలు జివిఎంసి అధికారులకు తెలియపరచాలన్నారు. అత్యవసరమైనచో జివిఎంసి టోల్ ఫ్రీ నెంబరు 1800 4250 0009 కు ఫోన్ చేసి ప్రజలు సమాచారాన్ని తెలియచేయాలని అదనపు కమీషనరు తెలిపారు.

Tags:
Views: 9

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ