సీబీఐకి చుక్కెదురు.. సంజయ్ రాయ్‌కు నార్కోటెస్ట్‌ నిరాకరించిన కోర్టు

సీబీఐకి చుక్కెదురు.. సంజయ్ రాయ్‌కు నార్కోటెస్ట్‌ నిరాకరించిన కోర్టు

 ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 13:ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పై నార్కో టెస్ట్  జరిపేందుకు కోల్‌కతా కోర్టు సీబీఐ కి అనుమతి నిరాకరించింది. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు నార్కోటెస్ట్‌కు అనుమతించాలని కోల్‌కతా కోర్టును సీబీఐ ఇంతకుముందు అభ్యర్థించింది. సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్‌‌‌లో నార్కో టెస్ట్‌కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్‌ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడుఆర్డీ కర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో ట్రయినీ వైద్యురాలి మృతదేహం కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించడంతో ఆ మరుసటి రోజే ఆగస్టు 10న సంజయ్‌ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నించి కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో రాయ్ ఉన్నాడు. బెయిలు కోరుతూ అతను చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు గత వారం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 20 వరకూ అతని జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.కాగా, కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సాక్ష్యాలపై సీబీఐ దృష్టి సారించింది. హతురాలి మృతదేహంపై కొరుకుడు ముద్రలు  కనిపించడంతో వాటితో పోల్చిచూసేందుకు సంజయ్ రాయ్‌ నుంచి దంత ముద్రలు, లాలాజలం నమూనాలను సీబీఐ సేకరించింది. నేరానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను కనుగొనడం, విశ్లేషించే విషయంలో సీబీఐకి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహకరిస్తోంది.

Tags:
Views: 3

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ