విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 16 విశాఖపట్నం: విశాఖ రాయపూర్ (దుర్గు ) వందేభారత్ రైల్‌‌ను ఈరోజువిశాఖ రైల్వే‌స్టేషన్‌లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్‌గా విశాఖ - రాయ్‌పూర్ వందే భారత్ ట్రైన్ తిరగనున్నది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో పూర్తి కెపాసిటీతో నడుస్తున్న రైల్ విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ అని అన్నారు. ఇక విశాఖ- రాయాపూర్ వందే భారత్ మూడు రాష్ట్రాల నుంచి నడుస్తోందని వివరించారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదని తెలిపారు. పార్వతీ పురంలో స్టాప్ ఏర్పాటు చేశామని అన్నారుభారత దేశంలోని మూడు రాష్ట్ర రాజధానుల్లో ఈ ట్రైన్ ఆగుతుందని వివరించారు. 14లక్షల ఉద్యోగులు ఉన్న సంస్థ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అతి త్వరలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

 

 

 
Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ