చంద్రబాబు విజన్‌ సూపర్‌

చంద్రబాబు విజన్‌ సూపర్‌

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 19 :‘‘సీఎం చంద్రబాబు విజన్‌ సూపర్‌. ఆయన ఆలోచనలు దశాబ్దం ముందుంటాయి. 2047 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌గా ఉండాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం’’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కూటమి పార్టీల సమావేశంంలో పవన్‌ ప్రసంగించారు. ‘‘సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి. ఒక తల్లికిపుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పార్టీలు వేరైనా ఆత్మ ఒక్కటే. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు మూడుగా కనిపించినా గుండె చప్పుడు మాత్రం ఒక్కటే. విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును రాజమండ్రి జైల్లో పెట్టారు. విజయవాడ వస్తున్న నన్ను కూడా ఆపారు. నేను ఆ రోజే ప్రభుత్వం మారబోతోందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పటం గ్రామంలో నిర్వహించిన సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమోమని ప్రతిపాదన చేశా. ఆ సమయంలో రాష్ట్రం బాగుండాలనే బలీయమైన కోరిక తప్ప మరొకటి లేదు. అది సాధించడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాం’ అని అన్నారు.‘‘నేను రోడ్డు మీకు వెళ్లిన ప్రతిసారీ మీరు గెలవరు. ఇప్పుడున్న వైసీపీనే గెలుస్తుందని అనేవారు. మనం గెలుస్తున్నామన్న నమ్మకం, ధైర్యం ఉన్నది చంద్రబాబుకు మాత్రమే. ఆయన నుంచి నేను నేర్చుకున్నది ఆ ధైర్యమే. అపార అనుభవం ప్రత్యక్షంగాచూశా. ఏం జరిగినా భయం అనేది ఆయనలో కనిపించలేదు. ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. కుటుంబ సభ్యుల్ని అవమానించినా, క్యాబినెట్‌ నిర్ణయాలకు బలి చేసినా జంకలేదు. రాజకీయం అంటే ఇలానే ఉంటుంది. మనం భరిస్తా ముందుకు వెళ్తాం అని చెప్పారు’’ అని పవన్‌ గుర్తుచేసుకున్నారు. అలాంటి నాయకుడి పక్కన ఉండి పాలనా తీరును, కష్టసమయంలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని అన్నారు. ‘‘53 రోజులు జైల్లో పెడితే ఎలా భరించారో చూశాం. నేను షూటింగ్‌లు కూడా చేయలేకపోయాను. ప్రొడ్యూసర్లకు క్షమించమని చెప్పాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం మారాలని కష్టపడుతన్నామని చెప్పాను. ఆయన ధైర్యం చేయూతనిచ్చింది. నా స్వార్థం అంతా రాష్ట్రం కోసమే. అందరినీ దారిలో పెట్టి, మెత్తగా మందలిస్తూ, గట్టిగా చెప్పే నాయకుడు నేతృత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా వంద రోజుల్లో అద్భుతమైన పాలన చేశాం’’ అని పవన్‌ వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. ‘‘సామాజిక పెన్షన్‌ను పెంచుదామంటే ఎలా అని అడగా. కష్టమే కానీ పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. మొదటి నెల రూ.7 వేల చొప్పున 65.18లక్షల మందికి రూ.4,800 కోట్లు ఇచ్చాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర ఇది. దీనికి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన పరిపాలన అనునిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆయన నుంచి ఏం చేర్చుకోగలగం? ఎంత సపోర్టుగా ఉండగలం? అన్న ఆలోచనలో ఉంటాను. ఉద్యోగులకు 1నే జీతాలు అందిస్తున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుచేశాం. పిఠాపురంలో భూమి కొంటే ఆయన (జగన్‌) ఫొటో నవ్వుతూ కనిపించింది. ఏపీ రాజమద్రని తీసేసి వ్యక్తి ఫొటో పెట్టుకున్నారంటే విచిత్ర ఆలోచన. అలాంటి చట్టాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రజల్లో చిరునవ్వులు తీసుకొచ్చారు’’ అని అన్నారు.వంద రోజుల్లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పురోగతి సాధించామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల ద్వారా రూ.998.62 కోట్లు విడుదల అయ్యాయని చెప్పారు. ‘‘70 శాతం పంచాయతీల్లో వైసీపీ సానుభూతి పరులే ఉన్నారు. ఆ పంచాయతీల్లో కూడా కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాం. 13,326 గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రికార్డు సాధించాం. ఉపాధి హామీ కూలీలకు రూ.2,081 కోట్లు చెల్లించాం. 4500 కోట్ల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నాం’’ అని చెప్పారుసీఎం చంద్రబాబు ఓపిక చూసి ఆశ్చర్యమేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన మనసు, మైండ్‌ నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో అధికారుల్లో మందకొడితనం వచ్చింది. వారిలో చలనం తీసుకురావడానికే చంద్రబాబు వరద నీటిలో నడిచారు. అన్ని స్థానిక సంస్థ ల్లో మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. విజయవాడ మేయర్‌ ఆ సమయంలో ఏమైపోయారు. వైసీపీకి బాధ్యత లేదు. ఎంతసేపటికీ విమర్శించడమే. వరదల సమయంలో అధినేత ఎలా ఉండాలో చంద్రబాబు చూపించారు. దానిద్వారా మేం స్ఫూర్తి పొందాం’’ అని వ్యాఖ్యానించారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. పాదయాత్రలో ఎనిమిదో రోజు 2023 ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగారుపాళ్యం శివార్లలో వంద కిలోమీటర్ల మైలురాయి అధిగమించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి వంద రోజుల్లో బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి డయాలసిస్‌ పరికరాలు అందజేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే లోకేశ్‌ డయాలసిస్‌ పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద ఐదు పరికరాలను బంగారుపాళ్యం ఆస్పత్రికి కేటాయించింది. ఒక్కోదాని విలువ రూ.50 లక్షలు. ఈ పరికరాలు పదిహేను రోజుల కిందటే ఆస్పత్రికి చేరుకున్నాయి. వీటిని కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో అమర్చుతున్నారు. నూతన ఆస్పత్రి భవనంతో పాటు డయాలసిస్‌ పరికరాలను త్వరలోనే మంత్రి లోకేశ్‌ ప్రారంభించనున్నారు.వైసీపీ హయాంలో తాండవించిన అరాచక పరిస్థితుల స్థానంలో కూటమి ప్రభుత్వం శాంతియుత వాతావరణం నెలకొల్పగలిగింది. ఏసీబీ.. జేసీబీ.. పీసీబీల నుంచి శుక్రవారాల రాత్రులు ప్రతిపక్షాలపై జరిగే దాడులు నిలిచిపోయాయి. తమను ఎవరో నిరంతరం గమనిస్తూ వేధిస్తున్నారన్న భావన నుంచి ప్రజలు బయటకు వచ్చారు. తాము ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటున్నామని, భయం భయంగా బతకాల్సిన వాతావరణం పోయిందన్న వ్యాఖ్యలు సాధారణ ప్రజల నుంచి కూడా వినవస్తున్నాయి. శాంతియుత వాతావరణం రాష్ట్రంలో వ్యాపారాల పెరుగుదలకు దారి ఇచ్చింది. పలుచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్లేవారు పెరిగారు. పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి ఆశావహ వాతావరణం కనిపిస్తోంది.కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో మంచి సఖ్యతను ప్రదర్శించింది. పై స్ధాయిలో టిడిపి, జనసేన, బిజెపి నాయకత్వాలు మంచి సత్సంబంఽధాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరచూ సమావేశమై అనేక అంశాలపై చర్చించుకొంటున్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా ముఖ్యమంత్రిని కలిసి అభిప్రాయాలు పంచుకొంటోంది. దీనితో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది.గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గణనీయంగా విమాన సర్వీసులు తగ్గిపోయాయి. అధికారంలోకి రాగానే పూర్వవైభవం తీసుకువస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పిన మాట ఆయన నిలుపుకొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో విమానయాన శాఖను టీడీపీకి కేటాయించడం రాష్ట్రానికి బాగా కలిసివచ్చింది. దీంతో ఢిల్లీకి అదనంగా రెండు విమాన సర్వీసులు మొదలయ్యాయి. ముంబై, బెంగళూరుకు ఒక్కో విమాన సర్వీసు, హైదరాబాద్‌కు అదనంగా మరో విమాన సర్వీసును విస్తరించారు. వచ్చే నెల నుంచి విజయవాడ-విశాఖపట్నం మధ్య మరో సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇలా అరడజనుకు పైగా విమాన సర్వీసులు పెరగటంతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. నెలకు 75 వేలమంది ప్రయాణించేస్థాయి నుంచి గత రెండు నెలలుగా నెలకు లక్షమందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విమానాశ్రయంలో ఎప్పటినుంచో పురోగతిలో లేని గ్రాండ్‌ ఎంట్రన్స్‌ వే ఇన్నాళ్లకు అందుబాటులోకి వచ్చింది.సామాజిక పెన్షన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి మొత్తం రూ.4000 చేశారు. బకాయిలు రూ.3,000 కూడా కలిపి జూలై నెల 1వ తేదీన రూ.7,000 పెన్షన్‌ను 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

 

Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ