సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అని అన్నారు. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారన్నారుఅందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లని గుర్తుచేశారు. వరద ముప్పుకు అందరూ స్పందించారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించి చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.కాగా.. వరద బాధితులకు బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన తమ వంతు సాయం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ