సురేష్‌పై ప్రేమతో పరామర్శించలేదు: గురునాథం

సురేష్‌పై ప్రేమతో పరామర్శించలేదు: గురునాథం

 ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 13:వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్‌ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్‌ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని బెదిరించటానికి వెళ్లాడని ఆరోపించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తన స్వార్థ రాజకీయం కోసం తనని వాడుకున్నాడని తెలుసుకున్న నందిగామ సురేష్ అప్రూవర్‌గా మారనున్నారని అన్నారు.జగన్‌కి తన దూతల ద్వారా సందేశం పంపిస్తే.. ఆగమేఘాల మీద జగన్ పరుగెత్తుకుంటూ వచ్చాడని గురునాథం వ్యాఖ్యానించారు. నందిగం సురేష్ మరో దస్తగిరి అవుతాడనే భయంతోనే జగన్ జైలుకు పరుగులు పెట్టారన్నారు. రాజధాని అమరావతి నాశనానికి పథక రచయిత తానే అనే పేరు ఎక్కడ బయటపెడతాడో అనే భయం జగన్‌లో మొదలైందన్నారు. నందిగం సురేష్ నిజాలు బయటపెడితే చంపివేస్తాడనే భయంతో ఆయన కుటుంబ సభ్యలో ఉందని రగునాథం వ్యాఖ్యానించారు.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులోనే నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పునిచ్చింది. రెండు రోజుల పాటు సురేష్‌ను విచారించేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు విచారించే అవకాశం కల్పించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా నందిగం సురేష్ ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సురేష్‌ను విచారించేందుకు అనుమతించారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ