అకాల వర్షాల పట్ల గంకల కవిత అప్పారావు ఆకస్మిక పర్యటన

ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2 ప్రాంతంలో ప్రత్యేక పర్యటన ప్రమాద స్థాయిపై ఉన్నత అధికారులతో పర్యటన చేసి పునరుద్దరణ పనులు చెప్పడతామని హామీ ఇచ్చిన గంకల!

అకాల వర్షాల పట్ల గంకల కవిత అప్పారావు ఆకస్మిక పర్యటన

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 9 :గత నాలుగు రోజులు నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలు పట్ల గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డు పరిధిలో గల కొండ వాలు ప్రాంతం ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2 ప్రాంతంలో అకాల వర్షం పట్ల 48వ వార్డ్ కార్పొరేటర్,భారతీయ జనతా పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు సోమవారం నాడు పర్యటన చేసి ప్రజల యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అకాల వర్షాలకు కొండ ప్రాంతం ఆనుకొని ఉన్న ఇండ్లను నేరుగా వెళ్లి గమనించి సమస్యలపై సమీక్షా నిర్వహించి అధికారులతో మాట్లాడి పలు సమస్యలు పరిష్కారం చూపమని అన్నారు.ఈ సందర్బంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పై లోతట్టు ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం అధికమైందనీ వీటి వలన స్థానికులు సమాచారం మేరకు వార్డులో పలు ప్రాంతాలు పర్యవేక్షణ చేశారు.ఈ సందర్బంగా ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2లో గోడ కూలి రహదారి మూసుకుపోవడంతో ఇబ్బందికర సంఘటనలను ఎదుర్కొంటున్నటువంటి ఇండ్లలో ఉన్న ప్రజలను గంకల కవిత అప్పారావు అప్రమత్తం చేసారు.ఈ సందర్బంగా గంకల మాట్లాడుతూ 48వ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడం జరుగుతుందని,వార్డు అభివృద్ధి కోసం జీవీఎంసీ కౌన్సిల్ లో వార్డు కార్పొరేటర్ గా పోరుబాట చేస్తూ వార్డు అభివృద్ధికి నిధులు తేవడం జరుగుతుందని, ఇందులో భాగంగా వార్డులో అకాల వర్షాలు పట్ల జరిగిన ఆస్థి నష్టం,పారిశుధ్య సమస్యపై  హుట హుటిన వార్డులో ఇబ్బందిగా ఏర్పడేటువంటి ఇండ్లలో ఉన్న ప్రజలను అప్రమతం చేయడం జరిగిందని ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2లో గోడ కూలి రహదారి మూసుకుపోవడంతో ఇబ్బందికర సంఘటనలను ఏర్పడడం పట్ల అధికారులతో చర్చించి తక్షణమే పర్యటన చేసి అధికారులతో కలిసి యుద్ధప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించేలా చూడాలని అధికారులను కోరారు.వర్షం ముప్పు తగ్గగానే మరి కొన్ని చోట్ల త్వరలో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని గంకల కవిత అప్పారావు హామీ ఇచ్చారు.వార్డులో నిరంతరం పర్యటన చేస్తూ అధికారులతో సంప్రదించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న గంకల కవిత అప్పారావు వార్డ్ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు కృషి పట్ల ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2 గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Tags:
Views: 12

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ