కృష్ణా నదీ బోర్డును నెల్లూరు రాయలసీమ జిల్లాలలో ఏర్పాటు చేయండి.

కృష్ణా నదీ బోర్డును నెల్లూరు రాయలసీమ జిల్లాలలో ఏర్పాటు చేయండి.

ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 13 :కృష్ణా నదీ బోర్డును నెల్లూరు జిల్లాలో గానీ లేదా రాయలసీమ జిల్లాల్లో గానీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టి రేణుకా రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు లోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం అనాలోచితంగా కృష్ణానది బోర్డ్ కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేసిందన్నారు. దీనివల్ల స్థానిక రైతులకు ప్రయోజనం లేదని వివరించారు. కృష్ణా నదీ బోర్డ్ కార్యాలయాన్ని సంబందము లేని వైజాగ్ లో ఏర్పాటు చెయడం వల్ల, కర్నూలు , కడప , అనంతపురం , చిత్తూరు, నెల్లూరు , ప్రకాశం , కృష్ణా జిల్లాలకు చెందవలసిన నీటివాటా అందక రైతాంగం తీవ్ర స్థాయిలో నష్ట పోయిందన్నారు . వైజాగ్ లో కార్యాలయం ఉండడం వల్ల చిన్నా , సన్నకారు రైతులు తమకు వున్న హక్కుల గురించి తెలుసుకోలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు . ఈ కార్యక్రమంలో  సంఘం నేతలు. విజయబాబు, గంగినేని రాజేష్  , . శ్రీధర్ రెడ్డి,. భీమేశ్వర రెడ్డి ,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ