హైదరాబాద్ నుంచి గొల్లపూడి మీదుగా అమరావతికి నరుక్కొచ్చిన చంద్రబాబు

హైదరాబాద్ నుంచి గొల్లపూడి మీదుగా అమరావతికి నరుక్కొచ్చిన చంద్రబాబు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 14:కేంద్రంలో, రాష్ట్రంలో.. రెండుచోట్లా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వాలే ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట పండుతోంది. అభివృద్ధికి రాచబాటలు వేసుకోవడానికి ఇంతకంటే అనువైన సమయం, సందర్భం రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఆయన ప్రణాళికలు రచించుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణం పనులు జరగబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ రహదారిని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి వరకు మాత్రమే విస్తరించాలని భావించారు.అయితే విజయవాడ నగరం ఏపీ రాజధాని అమరావతికి ఆనుకొని ఉంటుంది. కేవలం నది ఒక్కటే అడ్డు. ఒడ్డుకు అవతల అమరావతి ఉంటే ఇవతల విజయవాడ ఉంటుంది. దీంతో విజయవాడ నగరంలో భాగమైన గొల్లపూడి వరకు రహదారిని విస్తరించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. దీనికి ముందే 182 కిలోమీటర్లకు సంబంధించి డీపీఆర్ తయారుచేయాలనుకున్నా ఇప్పుడు గొల్లపూడిని కూడా చేర్చారు. 182 కిలోమీటర్లకు అదనంగా మరో 40 కిలోమీటర్లను విస్తరించాల్సి ఉంటుంది.జగ్గయ్యపేట నంచి విజయవాడ నగరంలోకి రావాలంటే గొల్లపూడి మీదుగా ప్రయాణించాలి. అయితే ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులుంటాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరువరుసల విస్తరణలో భాగంగా గొల్లపూడి వరకు పొడిగించడంతో రవాణాదారులకు, నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. డీపీఆర్ తయారుచేసే బాధ్యతను కన్సల్టెంట్ కు అప్పగించబోతున్నారు. ఎవరికి అనేది వచ్చే నెల చివరకు స్పష్టత రానుంది. ఈ రహదారి విస్తరణలో భాంగా 17 బ్లాక్ స్పాట్స్ ను రూ.325 కోట్లతో చక్కదిద్దుతున్నారు. దీంతో నందిగామ దగ్గర నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పనులను ఈ టెండరు పరిధి నుంచి తొలగించారు.




Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ