నెల్లూరులో గంగమ్మ ఒడికి గణనాధుడు .

నెల్లూరులో గంగమ్మ ఒడికి గణనాధుడు .

ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 11 :జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల్లూరు నగరంలో తాత్కాలిక  గణేశుని విగ్రహాలు నెలకొల్పి 11 వ తేదీ బుధవారానికి ఐదు రోజులు కావస్తోంది. నెల్లూరు నగరంలోని వివిధ కూడళ్లలో గణేష్ మిత్రమండలి సభ్యులు అనేక రూపాలలో బొజ్జ గణపయ్యను నెలకొల్పి స్వామివారికి భక్తితో విశేష పూజలు నిర్వహించారు. నైవేధ్యాలు పెట్టి , మంగళ హారతులిచ్చి , మేము తలపెట్టిన కార్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడాలని , అందరూ ఆయురారోగ్యలతో జీవించాలని గణనాధుని వేడుకున్నారు. వక్రతుండ మహాకాయా అంటూ స్వామి విగ్రహాలను నెలకొల్పిన అనేక సెంటర్లలో అన్నదానాలు నిర్వహించారు. ఐదు రోజులపాటు సంతృప్తిగా పూజలందుకున్న పార్వతీ పుత్రుడు నేడు నిమజ్జనానికి తరలిపోనున్నారు. డప్పు వాయిధ్యాలు, గణపతి బొప్పా మోరియా అంటూ యువత కేరింతలు, విద్యుద్దీప కాంతులనడుమ నగరంలో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ ఒడిలో గణపయ్య చేరానున్నారు . ఈ ఉత్సవాల తో నెల్లూరు నగరమంతా నిమజ్జన కోలాహలం నెలకొంది. నెల్లూరు గ్రామ దేవత ఇరుకాళమ్మ చెంతనున్న గణేష్ ఘాట్ లోనూ మరియు పెన్నా నదిలోనూ వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ