ఐటిడి ఏ లో కంట్రోల్ రూం ఏర్పాటు

ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్

ఐటిడి ఏ లో కంట్రోల్ రూం ఏర్పాటు

 ఐ ఎన్ బి టైమ్స్ పాడేరు ప్రతినిధి సెప్టెంబరు 9: బంగాళా ఖాతం ఏర్పడిన అల్పపీడనం నేపధ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని ఐటిడి ఏ పి. ఓ. వి. అభిషేక్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మూడు షిప్టులలో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఐటిడి ఏ పరిధిలో 11 మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సమాచారం వెంటనే అందించాలని కోరారు. ప్రతీ రోజు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 3.00 గంటల వరకు జె. మాధవి, జూనియర్ అసిస్టెంట్ 7780361430, ఎ.కామేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ 8500374633, సాయంత్రం 3.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఎల్. దేవా పాత్రుడు జూనియర్ అసిస్టెంట్ 94418 42177, బి. చైతన్య జూనియర్ అసిస్టెంట్ 9494781751, రాత్రి 8.00 గంటల నుండి మరుసటి రోజు 8.00 గంటల వరకు వై. రవి కిరణ్ కంపూటర్ ఆపరేటర్, ఎం. ఎ. జిలాని జూనియర్ అసిస్టెంటు 9492784678 ఫోను నంబర్లలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6.00 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు జె. తేజేశ్వరరావు, కె. మధు సూదన్ (8688158907 ) అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు 08935 251 737,  6303921374 నంబర్లలో అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర సేవలకు పైన పేర్కొన్న ఫోను సంబర్లకు ఫోను చేయాలని సూచించారు. ఎం హేమలత పరిపాలనాధికారి 9441919730, కన్యాకుమారి 8688158907 లను పర్యవేక్షణాధికారులుగా నియమించామని పి. ఓ పేర్కొన్నారు.

Tags:
Views: 21

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ