ఏపీలో రేపటి నుంచి మద్యం షాపుల బంద్-కారణమిదే..!

ఏపీలో రేపటి నుంచి మద్యం షాపుల బంద్-కారణమిదే..!

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06:ఏపీలో మద్యం షాపులు రేపటి నుంచి మూత పడబోతున్నాయి. కూటమి ప్రభుత్వం త్వరలో తెస్తున్న ఎక్సైజ్ పాలసీతో తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనతో ఉన్న మద్యం షాపుల ఉద్యోగులు నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో ఇలా షాపులు మూసేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఉద్యోగ సంఘం అడుగులు వేస్తోంది.రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు రంగంలో ఉన్న మద్యం షాపుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరిని తొలగించి ప్రైవేటుకు షాపులు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది.గత ప్రభుత్వం తమను పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించిందని, కానీ కనీస వేతనం కూడా సమయానికి అందించలేదని తమకి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా ఏజెన్సీలు తినేశాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజు లు వచ్చాయని ఆశ పడ్డామని వారు చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆవేదనతో నిరసనకు సిద్ధమయ్యారు. తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని వారు కోరుతున్నారు.


Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ