లక్ష మందిని జలసమాధి చెయ్యడానికి జగన్ కుట్ర, ఆఇద్దరూ అమలు చేశారు - లోకేష్

లక్ష మందిని జలసమాధి చెయ్యడానికి జగన్ కుట్ర, ఆఇద్దరూ అమలు చేశారు - లోకేష్

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:మాజీ ముఖ్యమంత్రి వైసీపీ, అధినేత వైయస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాదిమంది ప్రజలను జల సమాధి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పగ తీర్చుకోవాలని జగన్ ప్రయత్నాలు చేశారని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని, ఎంతకైనా ఒడిగడతాడని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లోనిన కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్న వైసీపీ నాయకులు మాపైన తప్పుడు ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీకి చెందిన నాయకులు ఇలా మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర పన్నారని అధికారుల దర్యాప్తులో బట్టబయలు అయ్యింద మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో చేసిన పోస్టు కలకలం రేపుతుంది. వైసీపీ పాలనలో అధికారం అడ్డం పెట్టుకున్న జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి సుమారు 50 మందిని చంపేశారని, అ ప్రాంతంలోని ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నమయ్య డాం కొట్టుకుపోయేలా పక్కా ప్లాన్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే తరహాలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను డీకొట్టడానికి పడవలు నదిలో వదిలేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారువిజయవాడతో పాటు పలు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలను జల సమాధి చేయడానికి జగన్ చేసిన కుట్ర బట్టబయలు అయ్యిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలతో డీకొట్టాలని జగన్ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ను వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం వాటిని అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.ప్రకాశం బ్యారేజ్ గేట్లను సంబంధించి విజయవాడ పోలీసులు ఇప్పటికే రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం ఉందా లేదా ? అని దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే విజయవాడ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వైయస్ జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.










Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ