తెరపై మళ్లీ రేషన్ వాహనాలు: సంక్షోభం వేళ..

తెరపై మళ్లీ రేషన్ వాహనాలు: సంక్షోభం వేళ..

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06:వారం రోజుల కిందట సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి, యనమలకుదురు, సితార సెంటర్, వాంబే కాలనీ, కబేళా సెంటర్, చిట్టినగర్‌, రాజరాజేశ్వరి పేట.. వంటి ప్రాంతాల్లో వరద నీరు తొలగిపోయింది. బురదతో కొత్త ఇబ్బందులు తలెత్తాయి.ఆయా కాలనీల్లోని దాదాపు అన్ని ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. వందలాది మంది తమ ఇళ్లల్లో బురదను తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వంట వండుకోవడానికీ ఏ ఒక్క గృహోపకరణాలు కూడా ఉపయోగపడకుండా పోయాయి. బియ్యం, పప్పులు, ఇతర ఆహార సామాగ్రి మొత్తం వరదల్లో తడిచిపోయాయి. ఎందుకూ కొరగాకుండా పోయాయి.అటు వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.రోజులు గడుస్తున్నప్పటికీ.. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా సహాయక చర్యలు అందని కాలనీలు విజయవాడలో చాలా ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. చాలినన్ని ఆహార వస్తువులు, గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.రోజులు గడుస్తున్నప్పటికీ.. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా సహాయక చర్యలు అందని కాలనీలు విజయవాడలో చాలా ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. చాలినన్ని ఆహార వస్తువులు, గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.విమర్శలు వెల్లువెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓ మెట్టు కిందికి దిగింది. గతంలో మూలన పడేసిన రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ వాహనాల ద్వారా విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామాగ్రిని పంపిణి చేయనుంది.వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఇంటింటికీ రేషన్ బియ్యం వాహనాలను వినియోగించుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికోసం మొత్తం 1,200 వాహనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు.ఈ- పోస్ విధానంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని, రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు అందజేస్తామని అన్నారు. పోలీసు శాఖలు సమన్వయంతో ఉచిత పంపిణీ చేయనున్నారు. ఆయా వాహనాలన్నీ కూడా విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డుకు తీసుకొచ్చారు.ఇవే బియ్యం బండ్లను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పడేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవే ఉపయోగపడుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వాహనాల రంగులను కూడా మార్చలేదు చంద్రబాబు ప్రభుత్వం. జగన్ ఫొటోను మాత్రమే తొలగించింది.ఎన్ని విమర్శలు చేసినా చివరికి జగన్ ప్రవేశపెట్టిన అవే వాహనాలు ఇప్పుడు ఈ రకంగా వినియోగించుకుంటోంది. ఇదివరకు వాలంటీర్ల సేవలను కూడా ప్రభుత్వం ఉపయోగించుకుంది. అదే వాలంటీర్ల వ్యవస్థ ఉండివుంటే వరద బాధితులకు సకాలంలో సహాయక చర్యలు అందేవనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.





















Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ