నగర అభివృద్ధి, మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలి - ఎంపీ భరత్

VMRDA సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ భరత్

నగర అభివృద్ధి, మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలి  - ఎంపీ భరత్

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి, సెప్టెంబర్ 10: విశాఖ నగర అభివృద్ధిలో కీలకమైన వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులపై మంగళవారం నాడు ఒక ముఖ్య సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు భరత్ అధ్యక్షత వహించగా, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జి, వీఎంఆర్‌డీఏ కమిషనర్  విశ్వనాథన్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. వీఎంఆర్‌డీఏ పార్క్ సమీపంలో ₹7.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఓషన్ డెక్ ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష జరిగింది.  వైశాఖి జల ఉద్యానవనాన్ని ₹40 కోట్లతో పునరుద్ధరించే ప్రణాళికపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో వినోద కేంద్రాలు, ఫుడ్ జోన్, డ్రైవ్-ఇన్ పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. కైలాసగిరిలో నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫే వంటి ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ ప్రాజెక్టులు పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలి అని ఎంపీ భరత్ అన్నారు.. 
ఇంటర్నేషనల్ అమ్యూజ్‌మెంట్ పార్క్,  అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్
జగదాంబ జంక్షన్‌లో మల్టీ లెవల్ పార్కింగ్, ఐటీ సిటీ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుల పై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు..  
ఎంపీ  భరత్ మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టులన్నీ నగర అభివృద్ధి, మౌళిక సదుపాయాల మెరుగుదలలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటిని సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయడం మన ప్రాధాన్యత" అని పేర్కొన్నారు. అలాగే పారదర్శకత, వేగవంతమైన అమలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిని నెలవారీ సమీక్షించాలని నిర్ణయించారు. నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అని  భరత్ అన్నారు..

Tags:
Views: 17

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ