బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదు

 బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:కాంగ్రెస్ ప్రజా పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్.‌.. రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17పై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చటం‌ సిగ్గుచేటన్నారు. ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయటానికే హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.ప్రజా పాలన దినోత్సవం కాదని... విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. రైతులను నడ్డి విరచటమే కాంగ్రెస్ ప్రజ పాలన అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను మోసం చేయటమే కాంగ్రెస్ ప్రజాపాల‌న అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకోవటమే ప్రజా పాలన అని అన్నారు. విదేశాల్లో భారతదేశంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. టెర్రరిస్టులతో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్‌లో ఉంటే 500 ఎంపీ సీట్లు గెలుచుకునేవాళ్ళమని తెలిపారు. సిక్కులను ఊచకోత కోసిందే రాహుల్ గాంధీ కుటుంబం అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ