చంద్రబాబు- పవన్‌కు కొత్త సంకటం

చంద్రబాబు- పవన్‌కు కొత్త సంకటం

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 10:రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.అయిదు దశాబ్దాలకుపైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్‌‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది.కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు.ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది.ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారుఎట్టి పరిస్థితుల్లోనూ తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వబోమంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను ఆందోళనకారులు గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలపై సమాధానం చెప్పాలంటూ పట్టుబ్టటారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.వారి ఆందోళన నేపథ్యంలో విశాఖపట్నంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సీఐటీయు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో రోడ్లపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల పాటు రాస్తారోకో కొనసాగింది.



















Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ