రోహిత్ శర్మ ఫ్యాన్స్ మొదలెట్టారు..!!

రోహిత్ శర్మ ఫ్యాన్స్ మొదలెట్టారు..!!

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్06:రేపు వినాయక చవితి. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో.. విఘ్న నాయకుడు కొలువుదీరబోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా గణేషుడి మండపాలు వెలుస్తోన్నాయి. వేల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు పూజలు అందుకోవడానికి సిద్ధమౌతున్నాయి.ప్రతి కుటుంబమూ వినాయకుడిని భక్తిప్రపత్తులతో తొమ్మిది రోజుల పాటు పూజించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. వినాయకుడి పండగ అంటే ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమే. తప్పెట్లు, మేళతాళాలు, ఊరేగింపులతో సందడి సందడిగా కొనసాగే పండగ ఇది.ఓ రకంగా చెప్పాలంటే.. కమ్యూనిటీ ఫెస్టివల్. కొన్ని వందలమంది ఒకే చోటికి చేరి, ఒకేసారి నిర్వహించుకునే అరుదైన పండుగ. ఈ వేడుకల సందర్భంగా భక్తులు గణేషుడి విగ్రహాలతో సెల్ఫీలు దిగడం, ఇంట్లో లేదా మండపాల్లో నిర్వహించే పూజలను తమ సెల్ ఫోన్ కెమెరాలతో బంధించడం, వీడియోలు తీయడం అతి సహజం.వినాయకచవితి నాడు అనేక రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. తాజాగా టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆయన అభిమానులు తయారు చేయించిన ఓ వినాయకుడి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఊపు ఊపేస్తోంది.టీ20 వరల్డ్ కప్ 2024ను రోహిత్ శర్మకు ప్రదానం చేస్తోన్నట్లుగా రూపొందించిన గణేషుడి విగ్రహం అది. వెస్టిండీస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌తో పాటు సగర్వంగా స్వదేశానికి వచ్చిన తరువాత ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో టీమిండియా ప్లేయర్లు నిర్వహించిన పరేడ్‌ను పోలిన విధంగా దీన్ని తీర్చిదిద్దారు అభిమానులు.ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి వందలాది సంఖ్యలో కామెంట్స్ పడుతున్నాయి. రీట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో దక్షిణఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించినప్పటి విజయాల తాలుకూ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసినట్టయిందీ .











Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ