ఉద్యోగుల కోత మొదలు..ఆందోళన షురూ..!!

ఉద్యోగుల కోత మొదలు..ఆందోళన షురూ..!!

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06:క్రీడాలోకంలో ఆ స్కూల్లు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. క్రీడాకుసుమాలను ఎందరినో తయారు చేశాయి ఆ పాఠశాలలు. గత దశాబ్దకాలంలో క్రీడా అవనికపై తెలంగాణ సగర్వంగా నిలబడేలా ఆ స్కూళ్లు చేశాయి. ప్రస్తుతం ఆ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. క్రీడల్లో టాలెంట్ ఉన్నప్పటికీ ఆ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటే అవకాశాలు ఇకపై ఉండకపోవచ్చు.. ఇంతకీ ఆ పాఠశాలలు ఏంటి, ఎందుకీ కష్టం వచ్చి పడింది. ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ స్కూళ్లు ఒక వరం అని చెప్పాలి.ఈ పాఠశాలల్లో చదివిన చాలామంది విద్యార్థులు క్రీడా రంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారు. ఇప్పుడు వీటి పరిస్థితి దయనీయంగా మారబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోచ్‌లను కొనసాంచకూడదని నిర్ణయించింది. దీంతో ఆ స్కూళ్లలో క్రీడల పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందిగత కొన్నేళ్లుగా విద్యార్థుల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించి, వారు ఏ క్రీడలో నైపుణ్యత కలిగి ఉన్నారో గుర్తించి వారిని మరింత మెరుగ్గా తీర్చి దిద్దారు స్పోర్ట్స్ కోచ్‌లు. చాలామంది విద్యార్థులు ఇక్కడే వీరివద్దే శిక్షణ తీసుకునే పలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. దేశం గర్వించేలా చేశారు. ఇక ఈ సొసైటీ 28 స్పోర్ట్స్ అకాడెమీలను నిర్వహిస్తోంది.ఈ అకాడెమీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అకాడెమీల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లల్లోని టాలెంట్ గుర్తించి వారిని అథ్లెట్లుగా తీర్చిదిద్దాలనే. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 35 మంది స్పోర్ట్స్ కోచ్‌లను గౌరవ వేతనం ఇస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ నియమించింది.ఇదిలా ఉంటే TGSWREISకు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం మెమో జారీ చేసింది.నాన్ రెగ్యులర్ స్టాఫ్, పార్ట్ టైమ్, అదనపు స్టాఫ్‌తో పాటు ఎవరైతే గౌరవ వేతనం పొందుతూ పనిచేస్తున్నారో వెంటనే వారిని తొలగించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు మెమో జారీ చేసింది. దీంతో స్కూళ్లల్లో స్పోర్ట్స్ కోచ్‌లు లేకపోవడంతో స్కూళ్లు మూత పడే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అంతేకాదు క్రీడల్లో సత్తా చాటుదామని ఈ స్కూళ్లలో చేరే విద్యార్థుల భవిష్యత్తు సైతం అంధకారంలో పడిపోతుందని క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ స్కూళ్లలో ఎన్‌రోల్ అయిన విద్యార్థులు చాలామంది బీద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వారే. వారి తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకునేవారో, ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవారో, బీడీలు చుడుతున్నవారు, కూరగాయలు అమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారి ఒకరి బిడ్డే లావణ్య. కామారెడ్డికి చెందిన లావణ్య రెజ్లింగ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్, రాష్ట్రీయ స్థాయి పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించింది. ఈమె తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు." ఈ అకాడెమీలో చేరేవరకు నాకు క్రీడల పట్ల అవగాహన లేదు. నేను విజయం సాధిస్తున్నానంటే దీని వెనుక నాకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లే కీలకంగా ఉన్నారు. ఇప్పుడు అకాడెమీలు మూసివేస్తే మేము కన్న కలలు, మా భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. మా అకెడెమీలను కొనసాగించాలి" అని లావణ్య తెలంగాణ టుడే అనే ఆంగ్ల పత్రికతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే స్పోర్ట్స్ కోచ్‌లను తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరారు కోచ్‌లు. విద్యార్థుల్లో స్కిల్‌ను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ఏటా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తున్నామని చెబుతున్నారు.ఇదిలా ఉంటే ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణిని కలిసేందుకు రాగ ఆమె నిరాకరించారు. దీంతో సిబ్బంది మొత్తం కలిసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమకు అందాల్సిన మూడు నెలల వేతనంతో పాటు ప్రభుత్వం స్పోర్ట్స్ కోచ్‌లను తొలగించాలని తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరుతూ రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు అక్కడకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా సొసైటీ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె నిరాకరిస్తున్నారని వాపోతున్నారు.విసుగు చెందిన సిబ్బంది మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్నదామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట ధర్నాకు దిగారుమొత్తానికి ఇప్పుడిప్పుడే క్రీడా అవనికపై తెలంగాణ విద్యార్థులు సత్తా చాటుతున్న వేళ ప్రభుత్వం స్పోర్ట్స్ కోచ్‌లను తొలగించడం సబబు కాదనేది ఇటు క్రీడాలోకం, అటు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.















Tags:
Views: 3

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ