హైదరాబాద్‌లో విచ్చలవిడిగా విస్కీ ఐస్‌క్రీమ్: వీళ్లది మామూలు టాలెంట్ కాదు

హైదరాబాద్‌లో విచ్చలవిడిగా విస్కీ ఐస్‌క్రీమ్: వీళ్లది మామూలు టాలెంట్ కాదు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ ధందాను ఎక్కడికక్కడ అరికడుతున్నారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తోన్నారు. పబ్‌లల్లో క్రమం తప్పకుండా డ్రగ్స్ పరీక్షలను నిర్వహిస్తోన్నారు. డ్రగ్స్ అమ్మకాలపై ముప్పేటదాడులు సాగిస్తోన్నారు.ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో మరో వింత వ్యాపారం వెలుగులోకి వచ్చింది. విస్కీతో ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తోన్న ఓ బిజినెస్ ఔట్‌లెట్‌ గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్‌తో పాటు పలు ఇతర నగరాలకూ వాటిని సరఫరా చేస్తోన్నట్లు దర్యాప్తులో తేలింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లో ఈ విస్కీ ఐస్‌క్రీమ్ తయారు చేస్తోన్న వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్‌పై ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడి చేశారు. పెద్ద ఎత్తున విస్కీ ఐస్‌క్రీమ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్‌ను ల్యాబొరేటరీకి పంపించారు. 100 పైపర్స్ విస్కీతో ఈ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.60 గ్రాముల ఐస్క్రీమ్‌ను తయారు చేయడానికి అందులో 100 మిల్లీ లీటర్ల విస్కీని కలుపుతున్నట్లు తేలింది. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌లను జూబ్లీహిల్స్‌ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏఏ నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలకు ఈ ఐస్‌క్రీమ్‌ను పంపించారనే విషయంపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది. వన్ అండ్ ఫైవ్ పార్లర్‌కు వచ్చిన ఆర్డర్ల గురించి తెలుసుకుంటోన్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో విస్కీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేశారు? ఎంత మేర విక్రయించారు?, రెగ్యులర్ కస్టమర్లు ఎవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.




Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ