కేసీఆర్ నవగ్రహ మహాయాగం - టార్గెట్ ఫిక్స్..!!

కేసీఆర్ నవగ్రహ మహాయాగం - టార్గెట్ ఫిక్స్..!!

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06:మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో నూ కేసీఆర్ తరచూ యాగాలు చేసేవారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కుడా ఫాం హౌస్ కు కేసీఆర్ పరిమితం అవుతున్నారు. ఇక, ఈ నెల 11వ తేదీన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. కీలక దిశా నిర్దేశం కు సిద్దం అవుతున్నారు.తెలంగాణలో రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం..కవిత అరెస్ట్..పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కకపోవటంతో కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. కవిత కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ స్కాం లో బెయిల్ పైన బయటకు వచ్చారు. తెలంగాణలో రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని...ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషిద్దామంటూ పార్టీ నేతలకు కేసీఆర్ తాజా సూచించారు. ఇందు కోసం కార్యాచరణ డిసైడ్ చేసేందుకు ఈ నెల 11న పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు.అందులో భాగంగా సెంటిమెంట్ బలంగా నమ్మే కేసీఆర్ ఈ యాగం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షలో ఈ యాగం కొనసాగుతోంది. రైతురుణమాఫీ ప్రధాన అంశంగా ప్రజల్లోకి వెళ్లేలా కేసీఆర్ జిల్లా పర్యటనల పైన కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ప్రతీ జిల్లాలోనూ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాల పైన పార్టీ నేతలు కసరత్తు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ఈ నెల 18వ తేదీ నుంచి జల్లా పర్యటనలు ఉండనున్నట్లు సమాచారం.






Tags:
Views: 5

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ