తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు గురువారం తెలంగాణ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని, భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న పోలీసులు భవన్ వద్ద భారీగా మోహరించారు. మహిళా కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో వారిని అడ్డుకున్నారు. అయినా కూడా వారు పోలీసులను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం వారు భవన్ ముందు భైటాయించి నిరసన చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ