తలపాగా చుట్టి..డోలు వాయించి..

లోక్యాతండాలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సందడి.బంజారాలతో కలిసి హోలీ.. కేళి

తలపాగా చుట్టి..డోలు వాయించి..

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: హోలీని పురస్కరించుకొని సాయం సంధ్య వేళ పిల్లలు..యువతీ యువకులు..మహిళలు..పెద్దలు ..అంతా ప్రధాన సెంటర్ లో గుమి గూడి ఉండగా..కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకొని ..వారిలో ఒ కరిగా మారి మరింత సందడి చేశారు. ఈ ఘటన కూసుమంచి మండలం లోక్యా తండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. హోలీ పండుగను పురస్కరించుకుని.. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి  లోక్యా తండాకు వెళ్లి.. వారితో మమేకమై.. ఆడి పాడి సందడి చేశారు.  గిరిజనులు వారి సంప్రదాయ సేవ్లాల్ పాకిడీ(తల పాగా) చుట్టారు. ఆ తర్వాత డోలు చేత బట్టి వాయించి మరింత ఉత్సాహం నింపారు. కోలాటం ఆడుతూ.. వారి సంప్రదాయ నృత్యంలో అడుగులేస్తూ.. హోలీ నీ ఆనందాల కేళి చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ వడిత్యా తావూరియా, రాజుల నివాసాలకు వెళ్లి.. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల నాటి సంప్రదాయాలను కొనసాగిస్తూ.. అందరూ కలిసి ఈ హోలీని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం