చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు !

ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలు తో మనస్తాపం చెంది..కనపడని లోకాలకు వెళ్ళాడు ?

చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు !

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 25: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు.  మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాల్లో మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎక్సైజ్ ప్రత్యేక జేఎఫ్‌సీఎం జడ్జీ ఎ మనికంఠ (36) ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. బాగ్ అంబర్‌పేటలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆయన కుటుంబంతో ఉంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లావణ్యతో ఏడు సంవత్సరాల క్రితం మనికంఠ పెళ్లైంది. వీరికి విశ్వనాథ్ (5) అనే కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా మణికంఠ తన భార్యతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తుంది.  ఇటీవల మనికంఠతో గొడవ పడి తన కొడుకుతో లావణ్య పుట్టింటికి వెళ్లింది. మరోవైపు మనికంఠ తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. ఓ వైపు తల్లి ఆరోగ్య పరిస్తితి విషమించడం, ప్రాణంగా చూసుకుంటున్న కొడుకుని భార్య పుట్టింటికి తీసుకుపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నిన్ను, కొడుకును చూడాలని ఉందని.. రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. భార్య మాట వినదు.. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగలేదు.. ఇలా అన్ని రకాలుగా మనోవేదనకు గురయ్యాడు మనికంఠ. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది బెడ్ రూమ్ లోకి వెళ్లి భార్య చున్నీతో ఫ్యాన్ కి ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అంబర్ పేట్ ఇన్స్‌పెక్టర్ అశోక్ తెలిపారు.  చిన్న వయసులో జడ్జీ స్థాయికి ఎదిగిన మణికంఠ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయామని తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మణికంఠ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం