బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుకు కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు అభినందనలు

బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుకు  కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు అభినందనలు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 26:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించిన తాండ్ర వినోద్ రావు  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని  సోమవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి  వినోద్ రావుగారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, ఖమ్మంలో ఘన విజయంతో అయనను మరింత బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. నడ్డా, కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణాలో బీజేపీ ఎవరూ ఊహించని ఫలితాలు సాధిస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు వినోద్ రావు  తెలిపారు. ప్రజలకు విస్తృత సేవ చేసేలా తనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్ సీ హెచ్ విద్యాసాగర్ రావు ను కూడా వినోద్ రావు  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని అయన వ్యక్తంచేశారు. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తాం. బీజేపీ జిల్లా  అధ్యక్షుడు గల్లా  పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన వినోద్ రావు  ఘన విజయం కోసం యావత్ బీజేపీ యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ  అన్నారు. "తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన వ్యక్తిత్వం గల వినోద్ రావు గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆనందంగా ఉంది. వారి విజయం కోసం అందరం కలసికట్టుగా కృషి చేస్తాం. అయన ఖమ్మంలో విజయం సాధిస్తారన్న నమ్మకం మాకుంది," అని అయన పార్టీ కార్యాలయంలో హొలీ సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

Tags:
Views: 13

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం