తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండగ పూట విషాదాలు

తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండగ పూట విషాదాలు

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 26:హోలీ పండుగ పూట సోమ వారం పలు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘట నల్లో ఏడుగురు యువకు లు, ఒక బాలుడు మృతి చెందారు.సికింద్రాబాద్ కంటోన్మెం ట్ పరిధిలో ద్విచక్ర వాహనా లపై వెళ్తున్న వారిని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లా, కౌటాల మండ లం, నదిమాబాద్ గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితు లు సోమవారం ఉదయం హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు.అనంతరం మధ్యాహ్నం స్నానం చేయడాని కో సం వార్ధా నది వద్దకు  వెళ్లారు. వీరిలో ఇద్దరు స్నానం చేసి ఒడ్డుపైకి వచ్చారు. మిగతా నలుగురు నదిలో స్నానం చేస్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంత య్యారు.దీంతో నది ఒడ్డున ఉన్న మిగతా ఇద్దరు వెంటనే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేయ డంతో వారు పరుగుపరు గున,వచ్చిగాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలించ గా అల్లం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ప్రవీ ణ్ (24), కమలాకర్ (24) అనే నలుగురి మృతదేహా లు లభ్యమయ్యాయి.మృతులంగా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నా యి. జిల్లా ఎస్‌పి సురేష్‌ కుమార్, డిఎస్‌పి కరుణా కర్, సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం