ప్రజల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు

మంచిర్యాల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ప్రజల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, మార్చి26:  మంచిర్యాల్ జిల్లాలోని లోక్ సభ ఎన్నికలలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని 003-బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ కొరకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరా, ర్యాంప్లతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో భాగంగా ప్రజలను ప్రలోభ పెట్టే నగదు, మద్యం, కానుకల రవాణా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, వాహనాల తనిఖీల విషయంలో అధికారులు ఖచ్చితంగా వ్యవహరించాలని తెలిపారు. విధులలో నిర్లక్ష్యం, అలసత్వం వహించినట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులు, పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. పిల్లలకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, తక్కువ, అతి తక్కువ ఎదుగుదల గల పిల్లలపై దృష్టి సారించి మామూలు స్థితికి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు సకాలంలో పోషకాహారం అందించాలని తెలిపారు. కథల పుస్తకాలు, వర్క్ బుక్స్, ఇతర మార్గాల ద్వారా పిల్లలకు విద్యాభ్యాసం చేయించాలని తెలిపారు. మండల శాఖ గ్రంధాలయాన్ని సందర్శించి పాఠకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కొరకు ఏర్పాటు చేసిన పుస్తకాలు, మెటీరియల్ను పరిశీలించారు. గ్రంథాలయంలో అవసరమైన అన్ని పుస్తకాలు, పత్రికలు, స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని గ్రంథ పాలకులను ఆదేశించారు. అనంతరం కాసిపేట గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి గ్రామపంచాయతీ రికార్డులు, పోలింగ్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భోజన్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు ఎం. కవిత, ఆర్. సౌందర్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 2

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం