బిజెపిని నిలువరించేది కమ్యూనిస్టులే.మోడీని గద్దెదింపే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలి. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో బిజెపియేతర అభ్యర్థులదే విజయం.

సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంకావాలి. కమ్యూనిస్టుల అవసరం దేశానికి ప్రస్తుత పరిస్థితిలో ఉంది--సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని.

బిజెపిని నిలువరించేది కమ్యూనిస్టులే.మోడీని గద్దెదింపే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలి. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో బిజెపియేతర అభ్యర్థులదే విజయం.

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మార్చి 26: రాష్ట్రంలో బిజెపి అడుగుపెట్టకుండా నిలువరించే సత్తా కమ్యూనిస్టులకె ఉందని, సిట్టింగ్ స్థానాల్లోనూ బిజెపి అభ్యర్థులు గెలవకుండా ప్రజలను చైతన్యవంతం చేసి అడ్డుకొని తీరుతామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పదేళ్ల మోడీపాలన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడంతోనే సాగిందని అన్నారు. కులాలు, మతాలమధ్య చిచ్చుపెడుతూ పబ్బం కదుపుతున్నారని అన్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దేశంలో ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా మారుతుండగా పేదలు మరింత పేదలుగా, కనీసం రెండు పూటలా తిండి తినలేని దౌర్చాగ్య పరిస్థితులు ఏర్చడుతున్నాయన్నారు. మోడీని గద్దెదింపే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలని, ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మోడీ పాలనలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, బిజెపి పాలిత, యుపిఏ అనుకూల రాష్ట్రాలకు దోచిపెడుతూ తెలంగాణ పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగ పరమైన పాలన సాగాలి కానీ సొంత ఎజెండాను ప్రజలపై రుద్ది పరిపాలిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దేశంలో ధరలు నానాటికీ పైపైకి పోతున్నాయని, వాటిని అదుపుచేయడంలో మోడి విఫలమయ్యారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో బిజెపియేతర అభ్యర్థులదేనీ విజయాన్ని, సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలినీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాష, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సలిగాంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు డీ శేషయ్య, వీశంశెట్టి పూర్ణచంద్రరావు, అడ్డుమల్లి సాయిబాబా, వాసిరెడ్డి మురళి, జీ వీరస్వామి, భూక్యా దసురు, వట్టికొండ మల్లికార్జున్, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, జీ నగేష్, వీ కొండలరావు, కంచర్ల జమలయ్య, లక్ష్మీపతి, కుమారి హనుమంతరావు, రాములు, భూక్యా శ్రీను, మునిగడప వెంకేటేశ్వర్లు, ఉ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం