వై వి సుబ్బారెడ్డితో మోగిన ఎన్నికల భేరి

దక్షిణంలో వాసుపల్లి ని గెలిపించండి- 1.వైసిపి అంటే కూటమికి భయం పట్టుకుంది- ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ!

వై వి సుబ్బారెడ్డితో మోగిన ఎన్నికల భేరి

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 :దక్షిణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార శంఖం ను  వై వి సుబ్బారెడ్డి  పూరించారు. ఆనవాయితీగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూజలు చేసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని ఆరంభించారు. 35 వ వార్డులో రథసారదులుగా వార్డు అధ్యక్షుడు ఆలుపున కనక రెడ్డి, సీనియర్ నాయకులు ఆది విష్ణు రెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం  సమక్షంలో కొబ్బరికాయ కొట్టి  ప్రచార రథాన్ని కదిలించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీతో కలిసి కూటమి పేరుతో వైసిపి పై దాడి చేయడానికి వస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పార్టీతో జత కట్టిన కూటమికి ప్రజల ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ఇక్కడ నుండే పాలన చేస్తారని చెప్పారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించి ముందుగా పోరాటానికి మద్దతు ఇచ్చిన పార్టీ వైసిపి అని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్నాయని, ప్రజల శ్రేయస్సు సంక్షేమానికి పథకాలు రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేర్చిన వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని, అలానే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణంలో మునుపెన్నడూ లేని  అభివృద్ధి జరిగిందని, 70 వేల గడపలకు 20,500 ఇల్లు పేదలకు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాల్లో దక్షిణ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలని ప్రజలను కోరారు. ఇక్కడ దుర్గమ్మ వారి ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని మళ్లీ అమ్మవారి ఆశీస్సులు ప్రజలు దీవెనలతో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రిగా తాను  ఎమ్మెల్యేగా మళ్లీ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో వాడి వినిపించేందుకు ఇక్కడి ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ ని రెండు లక్షల మెజార్టీతో మనమంతా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ డైనమిక్ లీడర్ వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న సేవలు, జగనన్న అందించిన సంక్షేమ అభివృద్ధి ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 కూడా ప్రజలు ఆశీర్వచనాలు అందిస్తారని అన్నారు. మహిళలకు బీసీలకు మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నీ మళ్లీ ముఖ్యమంత్రినీ చేసుకోవాలన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదన్నారు. విజయోత్సవ ర్యాలీగా సాగిన ప్రచార యాత్రలో ప్రజలు ఎక్కడికక్కడ హారతులు పడుతూ పూల వర్షం కురిపించారు. ఇక దక్షిణ వైసీపీ శ్రేణులు ఆనంద హేళతో నృత్యాలు చేసి వాసుపల్లి ప్రచార యాత్రకు వన్నె తెచ్చారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగని హరి వెంకట కుమారి,  వైసిపి జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ,గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ, నియోజకవర్గ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీ వాత్సవ్,  వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, గరికిన గౌరీ, కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమ, చెన్నా జానకిరామ్, మాసిపోగు మేరి జోన్స్, కోడూరు అప్పల రత్నం, భారీ సంఖ్యలో దక్షిణ నియోజకవర్గ వైసిపి శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం