పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ - 11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి వెంట్రుకలు వెలికితీత

పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్   - 11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి వెంట్రుకలు వెలికితీత

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మార్చి, 27: నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.   బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయి  సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10 సెంటీ మీటర్ల వెడల్పు తో జీర్ణాశయానికి అడ్డుగా ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అన్వర్ తెలపిన మేరకు.. 11 ఏళ్ల అమ్మాయి శరణీ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకుంటున్నా.. నొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు తమ ఆసుపత్రికి రాగా.. తాను క్షుణ్ణంగా పరీక్షించి.. పాప వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడప్పుడు పాప వెంట్రుకలు నోట్లో పెట్టుకుని నమలటం చూశామని చెప్పడంతో.. పరీక్షలు నిర్వహించగా.. జీర్ణకోశంలో అడ్డుందని గుర్తించాము.. వెంటనే తమ సహచర వైద్యుడు డాక్టర్ ఆనంద్ గౌడ్ పాప తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ఆపరేషన్ చేశారు. పాప కడుపులో దాదాపు 25  సె మి , పొడవు 10 సె మి వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా.. అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని.. క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు.. దీనిని ట్రైకోఫేజియా (Trichophagia) అంటారని డాక్టర్ అన్వర్ తెలిపారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు.  నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ (trichobezoar) అంటారని వివరించారు.

Tags:
Views: 11

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం