దక్షిణ ప్రజలకు నేనెప్పుడూ సేవకుడనే..

35వ వార్డులో రెండవ రోజు ప్రచారయాత్రలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ సిటీ మార్చి 28 :

దక్షిణ ప్రజలకు నేనెప్పుడూ సేవకుడనే..

నియోజకవర్గంలో ఉన్నత స్థానం కల్పించిన నా ప్రజలకేప్పుడూ నేను సేవకుడి గానే ఉంటానని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 35 వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణు రెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం రెండవ రోజు సార్వత్రిక ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగింది. ప్రసాద్ గార్డెన్ నుంచి ప్రారంభమైన వాసుపల్లి ప్రచార యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు వేసి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనపై  నమ్మకంతో ఎంత ఆప్యాయత చూపిస్తున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ సేవకుడి గానే ఉంటానని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు విద్యా వైద్యం కార్పొరేటర్ స్థాయిలో దొరుకుతుందన్నారు. జగనన్న రాష్ట్రానికి అందిస్తున్న సుపరిపాలన మరో 20 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు మత్స్యకారులను ఎంతో కించపరిచాడని, టిడిపి ప్రభుత్వంలో బీసీలకు, ఎస్సీలకు మైనార్టీలకు అట్టడుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెద్దపేట వేస్తూ పేద ప్రజల ముంగిటకు రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ప్రజలు ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుండి మొట్టమొదటి గెలుపును అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాన్పుగా అందజేస్తామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మహిళలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం