రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 28 : సార్వత్రిక సమరంలో రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది.గురువారం ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.రెండో విడుతలో ఔటర్‌ మణిపూర్‌లోని ఒక సీటు తోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది.ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరుగనుంది. జమ్మలో మాత్రం ఏప్రిల్‌ 6న నామపత్రాలను పరిశీలించ నున్నారు. రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.వీటితోపాటు మహారాష్ట్ర లోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.కాగా, మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి...

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం