ఎమ్మెల్యే వాసుపల్లికి జననీరాజనాలు

అడుగడుగునా హారతులిచ్చిన మహిళలు!

ఎమ్మెల్యే వాసుపల్లికి జననీరాజనాలు

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ సిటీ మార్చి 29 :  దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో జననీరాజనాలు పడుతున్నారు. 35వ వార్డు వైసిపి అధ్యక్షులు అలుపున  కనకారెడ్డి, ఆది విష్ణు రెడ్డి, వాసర్ల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మూడవరోజు దక్షిణ శాసనసభ్యుడు అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార యాత్ర కొనసాగింది. ప్రత్యేక అతిథిగా దక్షిణ ఎన్నికల వైసీపీ పరిశీలకులు ద్రోణంరాజు వాత్సవ్ వాసుపల్లి తో కలిసి ప్రచారం చేశారు.  కల్లుపాకలు ప్రాంతం గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించి విలువైన ఓటును ఫ్యాను గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. దక్షిణంలో జగనన్న అందించిన  పిలుపు వాసుపల్లి గెలుపు అంటూ జేజేలు పలికారు. ఈ సందర్భంగా  వాత్సవ్ మాట్లాడుతూ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్  గెలుపు కోసం ఒకే కుటుంబంలా కష్టపడతామన్నారు. ప్రచారంలో ప్రజల పలకరింపు చూస్తేనే కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలైన సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈరోజు ఓటు ప్రజల దగ్గరికి వెళ్లి ధైర్యంగా అడిగే హక్కు కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దుర్గాలమ్మ ఆశీస్సులతో మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రి సీఎంగా ఉంటారని అన్నారు.  ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, తాను చేసే సేవ దక్షణంలో పెద్ద ఎత్తున ప్రజాధారణ పొందడం ఆనందంగా ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ గరికిన గౌరీ మాట్లాడుతూ కల్లుపాకల ప్రచారంలో వార్ వన్ సైడ్ లా ప్రజల ఆదరిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, 35వ వార్డు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం