మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

మంచిర్యాల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, మార్చి 26:  మంచిర్యాల్ జిల్లాలోని లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశను పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 002-చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాలలో జరుగనున్న ఎన్నికల కొరకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 1 వేయి 131 ప్రిసైడింగ్ అధికారులు, 1 వేయి 111 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2 వేల 187 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు మొత్తంగా 4 వేల 429 మంది సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, సిబ్బందికి ఎస్.ఎం.ఎస్.తో పాటు సంబంధిత ఉత్తర్వులను అందించడం జరుగుతుందని, ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన విధులలో సవరణల కొరకు జిల్లా ఎన్నికల అధికారికి దరఖాస్తు అందజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 0

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం