జర్నలిస్టులకు న్యాయం చేస్తా --- హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీని కలిసిన జర్నలిస్టు ప్రతినిధుల బృందం

జర్నలిస్టులకు న్యాయం చేస్తా --- హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 26 : కారేపల్లి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి రామ గోపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు గైరాజరవుతున్న నేపథ్యంలో పలు పత్రికలలో వార్తలు రావడం జరిగింది. ఇట్టి విషయమై ఈనెల 18న అదే కారేపల్లి పాఠశాలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేత ఇరువురి విలేకరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి జర్నలిస్టులకు న్యాయం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రతినిధుల బృందం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డిని మంగళవారం కలిశారు. అందుకు స్పందించిన రూరల్ ఏసిపి మరోమారు విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్, భాస్కర్, మందుల ఉపేందర్, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష, కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, సాయి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, జిల్లా నాయకులు రోసిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం