విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, తల్లాడ మార్చి 27: విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు. పాఠశాలల్లో ఏర్పాటుచేయనున్న పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన తనిఖీ పిమ్మట, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నమోదు తక్కువగా ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరంలో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు, ఈ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నమ్మకం పెంచాలన్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మల్సూర్ తాండ లోని మండల పరిషత్ ప్రాధమికొన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజ పరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లాడ మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం